
పయనించే సూర్యుడు జూలై 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు చెరువు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా భారీ గుంతలు తవ్వుతూ అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సోమవారం ఆత్మకూరు ఆర్డీవో బి.పావని ను కలిసి వినతిపత్రం స్థానిక గ్రామ రైతులు. అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లక్కు కృష్ణప్రసాద్, కౌలు రైతుల సంఘం నేత లక్ష్మీపతి, గంధం నాగరాజు, ఆర్ వెంకటేశ్వర్లు, పాపిశెట్టి కృష్ణమోహన్, హజరత్తమ్మ తదితరులు పాల్గొన్నారు