
సమావేశంలో మాట్లాడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి…
రుద్రూర్, జూలై 14 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం గ్రామ శివారులో గల ఆదర్శ పాఠశాల, కళాశాలను సోమవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహంలో వంటగదిని పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్యాన్ని నెరవేర్చుకోని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చిన్నప్ప, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.