
పయనించే సూర్యుడు న్యూస్ జులై 15 సూర్యాపేట జిల్లా ప్రతినిధి
పి ఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం చివ్వెంల మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జెడ్పిహెచ్ఎస్ కుడకుడ పాఠశాల నుండి ఘనంగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు తంగెళ్ల జితేందర్ రెడ్డి,తీగల నరేష్ మాట్లాడుతూ పిఆర్టియు సంఘం చేసిన కృషి మూలంగానే ఉపాధ్యాయులకు సకల సౌకర్యాలు లభించాయన్నారు.ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కృషి మేరకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడం జరిగిందని తెలిపారు.రాబోయే కాలంలో పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు సంఘంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో చేరి బలోపేతం చేయాలని కోరారు.చివ్వెంల మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు షేక్ బషీర్,పొదిల రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పానుగంటి ప్రతాప్ కుమార్ కాజా ఖలీల్ అహ్మద్ ఖాన్ గిరి ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట యాదగిరి రాష్ట్ర కార్యదర్శి షేక్ షాబుద్దీన్,జిల్లా ఉపాధ్యక్షులు బుక్య శ్రీను నాయక్ జిల్లా కార్యదర్శి బుక్క రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు తలశెట్టి కరుణాకర్ దాసరి సతీష్ మండల అసోసియేట్ అధ్యక్షులు గుత్తికొండ మోహన్ రెడ్డి సీనియర్ బాధ్యులు మహమ్మద్ సాజిత్ నాతాల వెంకటరెడ్డి జిలకర శ్రీనివాస్ చివ్వెంల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల ఎలక అరుణ,సరస్వతి,రజిత,మంజుల తదితరులు పాల్గొన్నారు
