
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా పాల్గొన్న నియోజకవర్గం లో ఏర్గట్ల మండలం పి హెచ్ ఎస్ యెర్గట్ల 1981–1982 బ్యాచ్ 10వ తరగతి పునర్మిళనోత్సవాన్ని ఎంతో ఉల్లాసంగా జరుపుకున్నాము. విద్యార్థి దశలో కలుసుకున్న మిత్రులు, చాలా సంవత్సరాల అనంతరం మళ్లీ ఒక్కచోట కలవడం ఒక అద్భుతమైన అనుభూతి. పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటూ, మన జీవిత ప్రయాణాలను, వృత్తి విజయాలను మిత్రులతో పంచుకుంటూ, ఎంతో ఆనందంగా గడిపాము. ఈ సందర్భంగా మాలో కొందరు మిత్రులు చేసిన ప్రగతిని గర్వంగా పంచుకున్నాము. దేవకృప సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ జనరల్ హాస్పిటల్ వరంగల్ కొమరయ్య డిప్యూటీ కలెక్టర్* జక్కుల ప్రసాద్ గవర్నమెంట్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఓ సుధా ప్రస్తుతం బీహెచ్ఈఎల్ డిపో మేనేజర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ నిరంజన్** జక్కుల రాములు లాంటి స్నేహితులు తమ తమ రంగాల్లో మంచి స్థాయికి ఎదిగారు. విజయాలు మా బ్యాచ్‌కు గర్వకారణం. ఈ పునర్మిళనోత్సవం మన మిత్రబంధాన్ని మరింత బలపరిచింది. ఇలాంటి మరెన్నో సమావేశాలు జరిపే ఆశతో, మన అందరి మధ్యనున్న బంధం ఇలాగే పదిలంగా ఉండాలని కోరుకుంటూ… “ఒకే పాఠశాల, ఒకే జ్ఞాపకాలు – ఎన్నటికీ మరువలేని బంధం!”
