
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి జులై 16
చింతూరు మండలం ఐటీడీఏ ఆవరణలో పక్కన జరిగిన డీఎస్సీ అభ్యర్థుల సమావేశంలో గిరిజన డీఎస్సీ అభ్యర్థి పాయం మహేష్ అధ్యక్షునా జరిగిన సమావేశంలో జల్లి నరేష్ మరియు సీసం సురేష్ మాట్లాడుతూ 2025 మెగా డీఎస్సీలో నోటిఫికేషన్ లో గిరిజన ఐటీడీఏ ఏజెన్సీ పోస్టులను గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఐటీడీఏ ఏజెన్సీ ఏరియా పోస్టులను ఐటిడిఏ బైలా రూల్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం జనరల్ మెగాడీఎస్ లో కలపడం చట్ట విరుద్ధం అన్నారు పోస్టులను గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు రాబోయే రోజుల్లో మండల స్థాయి జిల్లా స్థాయిలో ఉద్యమం రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా తిమ్మ సాయి గారు సున్నం వెంకటేశ్వర్లు గారు పాల్గొ నీ మద్దతు తెలిపారు మరియు 4 మండల గిరిజన DSC హాజరయ్యారు తదితరులు పాల్గొన్నారు పాయం కామేష్ తెల్లం కోటేష్.జయంతి రాణి. సందీప్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు