
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
భీంగల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఈరోజు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జాగిర్యాల గ్రామంలో నిర్వహించిన ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు.ప్రతి శుక్రవారం గ్రామస్థాయి సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్లలో ఉన్న నిల్వన నీటిని పారబోయించి ఫ్రైడే ఫ్రైడే పాటించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా ఆంటీలర్వాస్పై బ్లీచింగ్ పౌడర్ చల్లడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు..అదేవిధంగా గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించి లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఎం పి ఓ జావిద్ అలీ ఏపిఓ నరసయ్య పంచాయతీ కార్యదర్శి అర్చన అన్ని గ్రామాల లో పంచాయతీ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది ఐకెపి సిబ్బంది ఐసిడిఎస్ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది ఈ ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్నారు
