
రంగారెడ్డి జిల్లా చందానగర్ లో బంద్ కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న విద్యార్థి సంఘాల నేతలు
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజీలలో నెలకొన్న సమస్యలతో పాటు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న విద్యాసంస్థల బందు పిలుపు నిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ప్రకటిం చారు. ఆ బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల శుక్రవారం శేరిలింగంపల్లి చందానగర్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉప అధ్యక్షుడు క్రాంతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం.పవన్ చౌహాన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రణయ్ శంకర్ ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మురళి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజ మాన్యాలు విద్యార్థు లను నానా ఇబ్బందులకు గురి చేస్తు న్నారని ఆరోపించారు.బకాయి ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలో మౌలిక సదుపాయాలను కల్పించి, ఆర్టీసీ లో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల అధ్యక్ష కార్యదర్శి నితీష్ ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.
