
మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్.
పయనించే సూర్యుడు, జులై 20, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయభేరి మోగించి సత్తా చాటాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ అన్నారు. గత పది సంవత్సరాలలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని టిఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని వారు దుయ్యబట్టారు. కాంగ్రెస్ శ్రేణులు సమిష్టి కృషితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో సత్తా చాటాలని టిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి హయాంలో కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ ఇవన్నీ జరిగాయని ఇది ప్రజలు గమనిస్తున్నారని ఇకనైనా ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలు మానివేయాలని హితవు పలికారు.