
//పయనించే సూర్యుడు// జులై 21//మక్తల్
ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు మక్తల్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో మక్తల్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఉమ్మడి మహబూబ్నగర్ యూత్ అధ్యక్షుడు బైరోపోగు సాంబశివుడు వనపర్తి జిల్లా కో ఆర్డినేటర్ ముకుందనాయుడు విద్యార్థి విభాగం అధ్యక్షులు శరత్ గౌడ్ పొడిగంటి సాయి శ్యామ్ రాములు
కరీంనగర్ నాయకులు చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. క్రియాశీలక సభ్యత్వం పంపిణి, స్థానిక ఎన్నికలలో పోటీకి సిద్ధం జనసేన. నిరంతరం కార్యకర్తల క్షేమం గురించి ఆలోచించే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రమాద భీమా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5,00,000 రూపాయలు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న మక్తల్ నియోజకవర్గ క్రియా శీలక వాలంటీర్ లకు జనసైనికులకు క్రియా శీలక సభ్యత్వ కిట్లను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే స్థానిక ఎన్నికలలో పోటీ చేయుటకు మక్తల్ నియోజకవర్గ జనసేన నాయకులు సిద్ధం గా ఉన్నారు..అని తెలియజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ చేసే మంచి కార్యక్రమలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి వివరించి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనీ క్రియాశీలక వాలంటీరలకు నిర్ధాశించడం జరిగింది. ఈ క్రియాశీల సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు రామన్ గౌడ్, గౌడి బల్రెడ్డి శివ ప్రసాద్ భీమేష్ శ్రీను అంజప్ప ,చిట్యాల నర్సిములు, ఆంజనేయులు ఆనంద్ రమేష్ ఉమేష్ శివ గౌడి రవీందర్ రెడ్డి మల్లేష్ బాలు తదితరులు

