
పయనించే సూర్యుడు జులై 25 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:జిల్లా కలెక్టర్ జితేష్. వి. పాటిల్ ఆదేశానుసారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులా నగర్ ఆవరణలో 100 మునగ మొక్కలు మరియు100 ఇతర రకాలు మరియు ఔషధ మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జయలక్ష్మి, ఎంపీడీవో శ్రీమతి మల్లీశ్వరి, వైద్యాధికారులు డాక్టర్ కందుల దినేష్ డాక్టర్ కంచర్ల వెంకటేష్ డాక్టర్ మధు వరుణ్ లు స్వయంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో కూడా మునగ మొక్కలు మరియు ఇతర ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లు వజ్జా పార్వతి, పాయం శ్రీనివాస్ స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్వేత పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ ఆరోగ్య విస్తరణాధికారి దేవా సూపర్వైజర్లు గుజ్జా విజయ కౌసల్య సింగ్ నాగు బండి వెంకటేశ్వర్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు