
టేకులపల్లి మండలం నుంచి భారీగా తరలి వెళ్తున్న సిపిఐ పార్టీశ్రేణులు
పయనించే సూర్యుడు జులై 26 పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ని అశ్వరావుపేటలో జిల్లా మూడవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క మహాసభకు టేకులపల్లి మండలంలోని శ్రేణులు భారీగా తరలి వెళ్లారు టేకులపల్లి మండలం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లామూడవ మహాసభ అశ్వరావుపేటలో 26. 27 రెండు రోజులు జరుగు మహాసభకు ప్రతినిధులుగా సిపిఐ మండల కార్యదర్శి గూగులోత్ రామ్ చందర్. సహాయ కార్యదర్శిలు అయితా శ్రీరాములు. గూగులోత్ శ్రీను. కర్లపూడి సుందర్ పాల్. మౌలా. జోగా కృష్ణవేణి. జయమ్మ పాల్గొన్న సందర్భంలో రామ్ చందర్ మాట్లాడుతూ భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన జిల్లా అభివృద్ధి కి బాటలు వేస్తారని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి పేదవాడికి గుండెల్లో ఎర్రజెండా స్థిరస్థాయిగా నిలిచిపోతుందని భూస్వామ్యులను ఎదిరించి సామ్రాజ్య వాద దోపిడిని ఎదిరించి బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అంటే కుల మత భేద వర్గాలు లేవని సామాన్యుడి బాధలలో దున్నేవాడిదే భూమి అని కార్మిక కర్షక అణగారిన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కష్టసుఖాలలో పాలుపంచుకోటమే భూ పోరాటంలో అమరులైన ప్రతి కామ్రేడ్ ను తలుచుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకు వెళుతుంది భారత కమ్యూనిస్టు పార్టీ అని పేర్కొన్నారు