
పయనించే సూర్యుడు జులై 26 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :SSG స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2025 సర్వేలో భాగంగా టేకులపల్లి మండలంలోని బేతంపూడి గ్రామపంచాయతీని స్టేట్ కోఆర్డినేటర్.జి సురేష్. సర్వే టీం సభ్యుడు రవీంద్ర రావు సందర్శించడం జరిగింది.ఈ విజిట్లో వారు అబ్జర్వేషన్ చేసిన అంశాలు డంపింగ్ షెడ్ పని చేస్తుందా లేదా కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారా లేదా మరియు గ్రామంలో పొడి చెత్త తడి చెత్త వేరు చేస్తున్నారా లేదా వేసిన ఎలా డిస్పోస్ చేస్తున్నారు అని పరిశీలించడం జరిగింది మరియు గ్రామం నందు స్కూల్స్ అంగన్వాడి సెంటర్స్ గ్రామపంచాయతీ ఆఫీస్, హాస్పిటల్ మరియు రిలీజియన్ మసీదు ప్లేస్ లను విజిట్ చేసి అక్కడ మరుగుదొడ్ల వినియోగం ఇంకుడు గుంతలు తడి చెత్త పొడి చెత్త వేరు చేయు విధానం పైన వారి తోటి ఇంట్రాక్ట్ అయ్యి వారి దగ్గర నుంచి అంశాలను తెలుసుకోవడం జరిగింది అలాగే గ్రామంలోని 16 ఇండ్లను సందర్శించి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు మరుగుదొడ్ల వినియోగం తర్వాత తడి చెత్త పొడి చెత్త వేరు చేయు విధానం పైన వారితో అంశాలను అడిగి తెలుసుకొని సర్వే వారికి ఇచ్చిన అంశాలను మొబైల్ యాప్ లో డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయడం జరిగింది అలాగే గ్రామపంచాయతీ నిర్వహిస్తున్న రికార్డుల మెయింటెనెన్స్ తర్వాత ప్రజలకు అవగాహన కోసం వేసే వాల్ పోస్టర్స్ గాని పెయింటింగ్స్ అవన్నీ మొబైల్ యాప్ లో రికార్డ్ చేయడం జరిగింది.సర్వే టీం వారు బేతంపూడి గ్రామపంచాయతీని విజిట్ చేసి గ్రామంలో అన్ని అంశాలు మంచిగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.వో మల్లేశ్వరి డిఆర్డిఏ ఎస్బిఐ కన్సల్టెంట్ రేవతి ఏపీవో కాళంగి శ్రీనివాస్ సెక్రటరీ ఏ.పీ.ఎం. రవి ఫీల్డ్ అసిస్టెంట్లు భద్రం అంగన్వాడి టీచర్లు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.