
షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని వెంటనే చేయాలి.
ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా……
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగస్టు 1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పాడేరు (అరకు)సభ సాక్షిగా జిఓ నెంబర్03ని మరల పునరుద్దరణ చేసి స్థానిక షెడ్యూల్ ఆదివాసులకే 100కు100% శాతం ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, ఆగస్టు 09న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు దానికి ప్రత్యామ్నాయ చట్టాన్ని ప్రకటించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ ప్రభుత్వని కోరడమైనది. ఆగస్టు08న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జిల్లా స్థాయి లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మారేడుమిల్లి మండలం లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.ఈ ముందంజ కార్యక్రమనికి ఆదివాసీ సమాజం భారీ స్థాయిలో పాల్గొనలని పిలుపు నివ్వడంజరిగింది,ఈ కార్యక్రమం అనంతరం జేఏసీ భవిష్యత్ లో అక్రమ వలసలు,అక్రమ కట్టడాలు,చట్టాలు,జిఓ లు పరిరక్షణ కొరకు ఎజెండా కార్యాచరణ ప్రకటిస్తుందని అన్నారు.ఆగస్టు09 వరకు ఆదివాసీ నవోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన ఆకు పచ్చ జెండాను ఎగారావేయాలని పిలుపునిచ్చారు.