
చేతిలో చీపురు పట్టిన బీజేపీ పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
బీజేపీ నిర్వహించిన బీసీ మహాధర్నా కార్యక్రమానికి బయలుదేరుతున్న సమయంలో షాద్ నగర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో గల విగ్రహాల చుట్టూ అశుభ్రతను గమనించిన బీజేపీ యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ గారు తీవ్రంగా స్పందించారు. నలుగురి బాధ్యత అని విస్మరిస్తున్న సమయంలో, జనాలను కళ్లు తెరిచేలా చేస్తూ, తానే స్వయంగా చేతిలో చీపురు పట్టి శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రజల హృదయాలను తాకింది.పరిపాలన పరంగా పాలకులు నిర్లక్ష్యం చేస్తూ విగ్రహాల చుట్టూ చెత్త పేరుకోవడానికి గల కారణంగా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్న తరుణంలో, ఓ యువ నాయకుడు తన మార్గాన్ని విడిచి ఇలా స్వచ్ఛత కోసం స్వయంగా పని చేయడం నేడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.ఈ సందర్భంగా ఆయన అధికారులకు గట్టి హితవు పలుకుతూ,ప్రతి రోజూ విగ్రహాల వద్ద శుభ్రత కార్యక్రమం తప్పనిసరి. జయంతి,వర్ధంతుల నాడు కాదు… ప్రజల హృదయంలో వారి స్ఫూర్తి జీవించాలంటే, దానిని ప్రాక్టికల్‌గా చూపించాలి,” అంటూ వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయ కుర్మయ్య, శివలింగం, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.