
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 4
ఈరోజు పేగ పంచాయతీ అల్లిగూడెం గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవంను ఉద్దేశించి ముఖ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు9న ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించినప్పటికీ మారు మూల గ్రామాలకు ఆదివాసీలకు ఒక్క దినం ఉన్నది అనే విషయం తెలియలేదన్నారు.ఆదివాసీలకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి అనే విషయం ప్రభుత్వాలు చెప్పలేక పొయ్యాయి. ఈ ప్రాంతంలో ఒక్క దశాబ్దం నుండి పేగ పంచాయతీ యువత మరియు నాయకులు తమ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం జెండా ఎగురవేసి అవగాహన కల్పిస్తున్నారు.పేగ పంచాయతీలో ఉన్న 16 గ్రామాలలో ఈనెల ఆరు ,ఏడు,ఎనిమిది, తేదీలో పీసా కమిటీ , పూజారి పెద్దల ఆధ్వర్యంలో గ్రామాలలోని జెండా ఎగర వేసి తమ హక్కుల గురించి సంస్కృతుల గురించి అవగాహన కార్యక్రమాలు చేయాలనీ పేగ పంచాయతి కమిటీ నిర్ణయించింది. ప్రతి గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలు హాజరు అయ్యి విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో చదువుకున్న యువత , ఉద్యోగస్తులు, కూడా భాగస్వామ్యం చేసుకొని హక్కుల పరిరక్షణ పై చర్చిచాలని అన్నారు. ముందస్తు ఉత్సవాల అనంతరం తొమ్మిదవ తారీకున పేగ పంచాయతీ పేగ గ్రామం నందు ఉదయం 7:30 గంటలకు ఘనంగా జండా ఆవిష్కరణ జరుగుతుందన్నారు.ప్రతి గ్రామం నుండి స్వతహాగా తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం చింతూరు ఐటీడీఏ నిర్వహిస్తున్న కార్యక్రమానికి పేగ పంచాయతీ నుండి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు .ఈ సమావేశానికి సర్పంచ్ పాయం చంద్రయ్య, గోటుల్ కో ఆర్డినేటర్ శ్రీను సోడే, సొసైటీ చైర్మన్ సరియం చిట్టి బాబు,ROFR కమిటీ చైర్మన్ తోడం చంద్రయ్య, పీసం పొద్దయ్య, సోడే సీతయ్య, కుంజా రఘువరన్, రవి, సంతోష్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు…