
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 5
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పేగ గ్రామపంచాయతీ పరిధిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ మహోత్సవాలలో భాగంగా పేగ పంచాయతీలోనీ గల గ్రామాలకు పేగ పంచాయతీ కమిటీ జెండా పంపిణీ చెయ్యడం జరిగింది. ప్రతి గ్రామంలో తమ హక్కుల పరిరక్షణకై గళం విప్పాలని గ్రామ గ్రామన ఘనంగా జెండా ఎగరవేసి తమ హక్కులు,సంస్కృతుల పై అవగాహన కల్పించాలని కోరారు. ఆదివాసీ యువతరం ఇప్పటికీ మేలుకొనక పోతే రానున్న రోజులలో ప్రమాదం పొంచి ఉందన్నారు. ఆదివాసీల హక్కుల పై ప్రతి గ్రామంలో అవగాహన కలిగి ఉండాలని ఆదివాసీలందరు ముందస్తుగా 8వ తేదీన ఆదివాసీ జేఏసీ తలపెట్టిన మారేడు మిల్లీ బహిరంగ సభకు తలరలి వెళ్లి ఆదివాసీల బలం ఏంటో చూపెట్టాలన్నారు. అలాగే ఆగస్టు 9వ తేదీన ఉదయం ఘనంగా పేగ గ్రామంలో ఉదయం 7:30 గంటలకు ప్రతి గ్రామం నుండి వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమాలకు అండగా ఉంటు సహాయ సహకారాలు అందిస్తున్న సర్పంచ్ పాయం చందయ్య గారికి , ఎంపిటిసి, వార్డు మెంబర్లకు, సొసైటీ చైర్మన్ కు, పీసా కమిటీ, అటవి హక్కుల కమిటీకి గోటుల్ కో ఆర్డినేటర్ సోడే శ్రీను ధన్యవాదములు తెలియ చేశారు ఈ కార్యక్రమానికి పీసా కమిటీ కార్యదర్శి అర్జున్ ఓయం, సూరకుంట యూత్ జాయింట్ సెక్రటరీ సుబ్బరాజు తోడం,పోడియం ధన , సంతోష్, ఆడమయ్య, రాజు , పాల్గొన్నారు….