
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 6
ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా.అనిల్, ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి.జోగారావు ల ఆధ్వర్యంలో మండలంలోని మారుమూల గ్రామాల్లో ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని, ఆదివాసి చట్టాలకు రక్షణ కల్పించాలని, మెగా డీఎస్సీ 2025నుండి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని, ఆగస్టు 8వ తేదిన మారేడుమిల్లి లో జరిగే అంతర్జాతీయ దినోత్సవంను జయప్రదం చేయాలని, కరపత్రాలు పంచుతూ చట్టాలు,జీవోలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు ప్రతి గ్రామం నుండి ఆదివాసి సమాజం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రానున్న కాలంలో ప్రతి ఒక్కరు ఆదివాసీ హక్కుల రక్షణకై కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవ్వ రామంజీ నెయులు ,తెల్లం నాగేష్, మడకం సతీష్, రవ్వ శశి ప్రకాష్,సవలం. జీవన్, తాటి అఖిల్, కట్టం నవీన్, తదితరులు పాల్గొన్నారు