
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
నంది నగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద శేర్లింగంపల్లి నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్,కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల నిధులతో శేర్లింగంపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి చేశామని ఇదే విషయాన్ని నేటికీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారని ప్రజల్లో ఉంటూ చేసిన అభివృద్ధిని వివరిస్తూ వారికి ఏదైనా సమస్య ఉన్నా కూడా పరిష్కరించే దిశగా నాయకులు కార్యకర్తలు ముందుకు వెళ్లాలని. పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగానే ఉంటుందని అన్నారు ఆనాడు కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప నేడు ఒక్క మంచి పని కూడా జరగలేదని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ మంచినీటితో ప్రజలు మౌలిక సదుపాయాలు అందక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తిరిగి మళ్లీ బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మళ్లీ పూర్వ వైభవం తీసుకొద్దామని తొందర్లోనే నియోజకవర్గం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయమని మేము కూడా వస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమములో కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు,వీణవరం సింధు ఆదర్శరెడ్డి,మాజీ కార్పొరేటర్లు సాయిబాబా,రంగారావు,బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రవి యాదవ్,హరీష్ రావు,బద్రయ్య ,మల్లా రెడ్డి సతీష్ రావు శ్రీనివాస్ గౌడ్ బాబూమియా శ్రీకాంత్ ముదిరాజ్ పురుషోత్తం యాదవ్ రోజా రామకృష్ణ కిరణ్ యాదవ్ శ్రీనివాస్ శ్రీకాంత్ వెంకటేష్ యాదవ్ సుబ్బరాజు సంజీవ రెడ్డి అల్లావుద్దీన్ పటేల్ రాములు తదితరులు పాలుగొన్నారు
