
పయనించే సూర్యుడు గాంధారి 13/08/25
మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల నూతన భవనానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. ప్రత్యేక పాఠశాల మండల కేంద్రానికి రావడం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాల రావడం చాలా గర్వ కారణం. ఈ భావన వ్యయం దాదాపు తొమ్మిది లక్షలు. ఈ పాఠశాల భవనంతో మండల కేంద్రంలోని దాదాపు 200 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరికీ ప్రత్యేక విద్యతోపాటు, క్రీడా, ప్రత్యేక కార్యక్రమాలు అందే విధంగా కృషి జరుగుతుందని రిసోర్స్ టీచర్ సాయన్న తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, కాంప్లెక్స్ ఇన్చార్జి హెడ్మాస్టర్ పండిత్, కల్పన, ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య, భవ్య, కంప్యూటర్ ఆపరేటర్ ప్రసాద్, సి ఆర్ పి లు షాయద్, సాయిలు, రామారావు, అంగన్వాడీ టీచర్ పద్మ, నితిన్ దివ్యాంగులు పాల్గొన్నారు.