
ఎస్.ఆర్. రంగనాథన్‌కు నివాళి
( పయనించే సూర్యుడు ఆగస్టు 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ గ్రేడ్-1 గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా భారత గ్రంథాలయ వ్యవస్థాపకుడు, ఆధునిక గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రతిమకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠకులకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ చైర్మన్ కొప్పుల మదన్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్, వీరేశం,ప్రధాన కార్యదర్శి క్యూసెట్ శ్రీనివాస్, ఆర్గనైజర్ అల్వాల్ దర్శన్ గౌడ్, డైరెక్టర్ కే. రవి నాయక్, డైరెక్టర్ ఫయాజ్, శంకర్ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
