
పయనించేసూర్యుడురిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 15 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు డివిజన్లో చింతూరు ఐటీడీఏ వారు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ ఐఏఎస్ వారి ద్వారా ప్రశంసా పత్రాలు చింతూరు ఐటిడిఏ నందు అందజేశారు. అందులో భాగంగా ఉత్తమ సేవలందించినందుకు గాను ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుంపెనపల్లి.అచ్చమ్మ గారు అలాగే చింతూరు డిప్యూటీ ఎంపీడీవో గుంపెనపల్లి.మోహన్ కు చింతూరు ప్రాజెక్టు అధికారి చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగింది. వీరు ఇరువురు కూడా అక్క, తమ్ముళ్లు ఒకే కుటుంబం నుండి ప్రశంసా పత్రాలు అందుకోవడం గమనార్ధం వీరు ఇరువురు కూడా ప్రశంసా పత్రాలు అందుకోవడంతో ఆదివాసి జేఏసీ నాయకులు జల్లి నరేష్,కాకా సీతరామయ్య మరియు స్థానిక పెద్దలు,రాజకీయ నాయకులు తదితరులు అభినందనలు తెలియజేశారు.
