{ పయనించే సూర్యుడు} {అక్టోబర్31}
బుధవారం ఉదయం 10 గంటలనుండి మక్తల్ రాయల్ ఫంక్షన్ హాల్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కై “చలో బీసీల గర్జన సభ” విజయవంతం అయ్యింది కెవి నరసింహ అధ్యక్షతన జరిగిన చలో బీసీ గర్జన సభకు ముఖ్య అతితులుగా బీసీఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లదుర్గం సురేష్ హాజరువడం జరిగింది విశిష్ట అతితులుగా బానీషా నారాయణ మరియు బైరి శేఖర్ ఓయూ జేఏసీ ఇంట లెక్చవల్ ఫోరమ్ స్టేట్ కన్వినర్ మరియు అవ్వరు వేణు కుమార్ హాజరయ్యారు ఈ సభను ఉద్దేశించి అల్లదుర్గం సురేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడిచిన, రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక, ఆర్థిక రాజకీయ సమానత్వం దేశ జనాభాలో సగభాగం పైగా ఉన్న 70 కోట్ల బీసీ ప్రజలకు అందని ఎండమావైపోయినది. గత ఏడు దశాబ్దాలుగా దేశంలో జరిగిన అన్ని రంగాలలోని అభివృద్ధికి నోచుకోక,బీసీ ప్రజల కులవృత్తులు నశించి, నిరుద్యోగంతో,పేదరికంలో మగ్గిపోతున్నారు, దేశాన్ని పాలించిన పార్టీలు బీసీ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానె మిగిల్చబడ్డారు,ఈ దేశంలో బీసీ ప్రజలను అణచి వేసినంతగా ప్రపంచంలో ఏ జాతిని అణచివేయబడలేద భారత రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల ప్రజలకు అన్ని రంగాలలో తగిన భాగస్వామ్యం కల్పించడానికి, ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి, రాజ్యాంగబద్ధంగా ఒక కమిషన్ నియమించవచ్చని పేర్కొన్నప్పటికీ పాలకవర్గాలు, తగిన చట్టబద్ధమైన చర్యలు చేపట్టలేదన్నారు బానిస నారాయణ మాట్లాడుతూ బీసీ ప్రజల సమగ్రాభివృద్ధి కోసం మొదటిసారి 1953 లో కాకా కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిషన్ యొక్క రిపోర్టును, పార్లమెంటులోకి కూడా రానీయలేదు, తర్వాత బీసీ ప్రజల కోసం ఏర్పాటు చేసిన 2వ కమిషన్ బీపీ మండల కమిషన్ 1979లో మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, బీపీ మండల కమిషన్ బిసి ప్రజల సముద్రాభివృద్ధి కోసం 40 సిఫారసులు చేయడం జరిగింది, ఈ యొక్క 40 సిఫారసులలో ఒకే ఒక్క సిఫారసు అమలు చేయడానికి జనతా దళ్,వీపీ సింగ్ ప్రభుత్వం ప్రకటన చేయగానే ప్రభుత్వాన్ని కూల్చివేశారు అన్నారు శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ వాగ్దానం ప్రకారంగా బీసీ ప్రజలకు విద్య,ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ కల్పించడానికి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష పార్టీల డెలిగేషన్ ను ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లాలి అని పిలుపునిచ్చారు డి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య చంద్ర మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్స్ కు ప్రధాన అడ్డంకిగా ఉన్న 50%రిజర్వేషన్ పరిమితిని అధికమించడానికి బీసీల కోసం రాజ్యాంగ సవరణతో చేసిన చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చవలసిందిగా రాజకీయ ఒత్తిడి తేవాలి.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు ముఖ్యంగా బిజెపి ఎంపీలు దేశంలోని అన్ని పార్టీల ఓబీసీ ఎంపీల మద్దతును కూడ గట్టాలి.కాంగ్రెస్ ప్రభుత్వం,కోర్టులతో కాలయాపన తగదు,రాజ్యాంగ సవరణ, రాజకీయ వ్యవహారంతో కూడుకున్నదికావున, తమిళనాడు రాష్ట్రంలో మాదిరి,బీసీల 50%రిజర్వేషన్, మొత్తం 69% రిజర్వేషన్ అన్ని పార్టీల ఐక్యతతో ఎలా సాధించారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది 75 ఏళ్లలో భారత రాజ్యాంగానికి 106 సార్లు రాజ్యాంగ సవరణలు చేసి నూతన చట్టాలను చేయడం జరిగింది,దేశంలో సగభాగం కలిగిన 70 కోట్ల బీసీ ప్రజలకు ఒక్క రాజ్యాంగ సవరణ చేయలేరా. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు. కె. రామాంజనేయులు గౌడ్ గారు గారు. మాట్లాడుతూబీసీలు రాజకీయ శక్తిగా ఎదగనంత కాలం అడుక్కునే ఉద్యమాలు దశాబ్దాలుగా కొనసాగుతూఉంటావి, బీసీలు ఓటు బ్యాంక్ గానే మిగిలిపోతారు అన్నారు. ఈ సభకు కార్యనిర్వాకులు ఓబ్లపూర్ కె.తిమ్మప్ప ఉజ్జెల్లి కాలభందా బస్వారాజ్ బిస్వర్ లొట్టి శివప్రసాద్ కొత్తపల్లి కుమ్మరి ఆంజనేయులు హిందూపూర్ ఆంజనేయులు బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు గౌడ్ రాష్ట్ర కోశాధికారి. రంగప్ప యాదవ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ ఆంజనేయులు మగనూరు అశోక్ రజక సంగం మగనూరు మండలం అధ్యక్షులు బలప్ప గుడిగండ్ల గ్రామం సిపి నరేంద్ర రజక సంగం జిల్లా అధ్యక్షులు పండు గుండెబాల్లూరు విజయ్ గౌడ్ ముదమాల్ అంబేద్కర్ యువజన సంగం అధ్యక్షులు రాము మహాత్మా జ్యోతి భా పూలె వారధి కమిటీ మెంబెర్ బంగి రాకేష్ tmrps వెంకటేష్ మహబూబ్ నగర్ బీసీ ఐక్య వేదిక ఉపాధ్యక్షులు రాజు గారు మక్తల్ అసెంబ్లీ పరిధిలో వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన బీసీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

