
అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డు జారీ చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయం గండి
బోగస్ రేషన్ కార్డు లను వెంటనే తొలగించాలి
ఏడాదికి కోట్లల్లో టర్నోవర్ వ్యాపారస్తులకు కూడా రేషన్ కార్డు జారీ
దళారుల చేతుల్లో ప్రభుత్వ రెవెన్యూ అధికారులు క్షణాల్లో అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డు జారీ
అర్హత ఉండి పైసలు ఇచ్చుకోలేని లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిందే అయినా రేషన్ కార్డు వస్తుందా లేదా అనేది నమ్మకం లేదు
పయనించే సూర్యుడు నవంబర్ 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లాలో విచ్చలవిడిగా రేషన్ కార్డు దందా నడుస్తున్న పట్టించుకోని జిల్లా యంత్రాంగం మరి ఇందులో జిల్లా యంత్రాంగం అధికారుల యొక్క పాత్ర ఏమైనా ఉందా అని లబ్ధిదారుల గుసగుసలు దళారులు అంతా మేము చూసుకుంటాం నీకెందుకు టెన్షన్ 5000 ఇవ్వండి అంతా మేమే చూసుకుంటాము జిల్లాలో ఉన్నటువంటి మండలాల ఎమ్మార్వో కార్యాలయాల్లో డబ్బులకు రేషన్ కార్డులను ఇప్పిస్తున్న దళారులు నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న అక్రమార్కులు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలకు అర్హత కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు అక్రమార్కులు రేషన్ కార్డు దందాకు ఆయువు పోశారు