బహుమతికి సహకారం అందించిన సీనియర్ నేత రాజా గౌడ్ …
పయనించే సూర్యుడు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ (10: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
ఆదోని పట్టణంలోని మున్సిపల్ మైదానంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త టిడిపి సీనియర్ నాయకుడు రాజా గౌడ్ హాజరయ్యారు.. రాజా గౌడ్ కు టోర్నమెంట్ మేనేజ్మెంట్ వారు శాలువాతో సన్మానించారు.. వారితో కలిసి కాసేపు సరదాగా గడిపి బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ ఆడారు.. సందర్భంగా రాజా గౌడ్ మాట్లాడుతూ క్రీడలతోని మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని క్రీడలు ప్రోత్సహించడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటామని ఈ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ముజీబ్, శీను, యువకులు తదితరులు పాల్గొన్నారు..