పయనించే సూర్యుడు జనవరి 11 : ప్రతినిధి భూక్యా కవిత:
హైదరాబాద్ – విజయవాడ 65 వ జాతీయ రహదారి పై ఇటీవల కురిసిన వర్షాలకు వరద ఉధృతికి దెబ్బతిన్న జగ్గయ్యపేట గరికపాడు వద్ద గల పాలేరు వంతెన ఈరోజు పూర్తి కావడంతో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దానిని పునః ప్రారంభించారు. గత నాలుగు నెలలుగా వాహనదారులు తీవ్ర ఆవస్తులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రత్యేక చొరవ తీసుకొని పీడీ నాగేశ్వరరావుతో మాట్లాడి వంతెన మరమ్మత్తులు త్వరగా పూర్తయ్యే విధంగా తన వంతు చర్య తీసుకున్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు పనులు పూర్తి కావడంతో జాతీయ రహదారిలో నాలుగు లైన్ లు వాహనాలు ప్రయాణించుటకు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జెండా ఊపి రాకపోకలకు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కట్టా వెంకట నరసింహారావు, కసుకుర్తి శ్రీనివాసరావు, యానాల గోపీచంద్, కానూరి కిషోర్, మాదినేని నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
హైవే పై వాహనాలు పునః ప్రారంభం : ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య
RELATED ARTICLES