పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి( పోనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేల రూపాయల స్థిర వేతనం నిర్ణయించాలని ప్రమోషన్
పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత దరిద్రత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ఆశా వర్కర్లు ప్రదర్శన నిర్వహించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా ను చేపట్టారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి, ఆశా వర్కర్స్ యూనియన్ భద్రాద్రి సహాయ కార్యదర్శి వజ్జ సుశీల పాల్గొని మాట్లాడుతూ ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని గత సంవత్సరం 15 రోజులు సమ్మె హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో లో పొందుపరిచిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆశాలకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఉత్తరుడు జారీ చేయాలని ఆశాల మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలని ప్రతి ఆదివారం మరియు పండగ సెలవులు ఆశా వర్కర్లకు ఇవ్వాలని ఏఎన్సిపిఎన్సి తదితర టార్గెట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షల రూపాయలు చెల్లించాలని సగం పెన్షన్ నిర్ణయించాలని ఆశలకు ప్రతి సంవత్సరం 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, వారు
పలు డిమాండ్లతో ఆశలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తాళ్లూరి
కృష్ణ, గంధసిరి ఉమాదేవి, మల్లేశ్వరి, సడియం సుగుణ, చంద్రకళ, పార్వతీ, కౌసల్య ,అనసూర్య, కావేరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.