పయనించే సూర్యడు జనవరి 10 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
ఈరోజు రత్నవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ బ్రహ్మశ్రీ పత్రీజీ గారి ధ్యానమార్గ ప్రయాణంలో భాగంగా పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కాటేపల్లి శైలజ ధ్యాన రత్న గారి సారధ్యంలో మిరియాల ఆంజనేయులు గారి నేతృత్వంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాటేపల్లి శైలజ మాత గారు మాట్లాడుతూ మానవుడికి ధ్యానమార్గమే మోక్షమార్గమని, అంతిమ మార్గమని, ధ్యానం వల్ల మానసిక శారీరక రుగ్మతలు సంపూర్తిగా తొలగిపోతాయని వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ధ్యాన మార్గాన్ని అవలంబించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన సందేశకులు, ధ్యానబిలాషులు, గ్రామ పెద్దలు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.