పయనించే సూర్యుడు, జనవరి 10,దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా.
దేవరకొండపట్టణ పరిధిలోని శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయం ప్రాంగణంలో లోకసాని పద్మ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ప్రాడక్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ & ఫార్మర్ వెల్ఫేర్ చైర్మన్ కోదండ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
అనంతరం ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.
లోకాసాని పద్మ రెడ్డి కుంకుడుకాయలు మరియు ఇతర ప్రకృతి ఉత్పత్తులతో తయారుచేసిన షాంపూ డిష్ వాషర్,ఫ్లోరో క్లీనర్, హ్యాండ్ వాష్ మరియు వ్యవసాయమునకు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ మరియు ఫంగిసైడ్ తయారు చేయడం అభినందనీయం అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఎదుల నుంచి డిండి ప్రాజెక్టు నీటిని తీసుకురావడం కోసం మంత్రి వర్గం ఆమోదించింది అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, రైతాంగాన్ని కావాల్సిన పెట్టుబడి సహాయాన్ని సంక్రాంతి పండుగ నాటికి అర్హులైన వారందరికీ ఎకరాకు 6000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ & ఫార్మర్ వెల్ఫేర్ చైర్మన్ కోదండ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ ల సంఘం అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి,వ్యవసాయ కమిషన్ సభ్యులు కెవిఎన్ రెడ్డి, సీనియర్ నాయకులు కర్నాటి లింగా రెడ్డి,బ్రహ్మ శ్రీ సూర్య నాయరణ స్వామి,అధ్యక్షులు శ్రవణ్ , కోశాధికారి కర్నాటి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.