పయనించే సూర్యుడు ,జనవరి 10,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపహాద్ మండలం, సారపాక 1 కి అంగన్వాడీ కేంద్రంలో , ఐటీసీ మిషన్ సున్హెర కాల్ – ఐజిడి ఎన్జీవో మరియు అంగన్వాడి టీచర్ ఆధ్వర్యంలో శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంల ఐసిడిఎస్, సిడిపిఓ రేవతి , సూపర్వైజర్ సక్కుబాయి , అంగన్వాడీ టీచర్ వెంకటరమణ , ఏఎన్ఎం సుజాత, ఆశ వర్కర్ కళ్యాణి , ఐజిడి ఎన్జిఓ నుండి ఫీల్డ్ కోఆర్డినేటర్ ప్రశాంతి , స్వాతి మరియూ అభిషేక్ లు పాల్గొన్నారు ,
ఈ కారయక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ , రేవతి మాట్లాడుతూ , ముందుగా గర్భిణీ స్త్రీలకు శుభాకాంక్షలు తెలుపుతూ , గర్భిణీ గా ఉన్న సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలను గుర్తుచేశారు , ఆహారం పట్ల శ్రద్ధ వహించి మంచి పోషణ తో కూడిన ఆహారం తీసుకోవాలని , అలాగే తల్లిపాలు ప్రాముఖ్యత గురించి తెలిపారు .
సూపర్వైజర్ సక్కుబాయి గర్భిణీ స్త్రీలకు శుభాకాంక్షలు తెలిపారు
ఏఎన్ఎం స్వాతి ఇమినైజేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి గర్భిణీ స్త్రీలకు వివరించారు
తరువాత ఐటీసీ మిషన్ సున్హెర కాల్ , ఐజిడి ఎన్జీవో స్వాతి మాట్లాడుతూ , ముందుగా విచ్చేసిన అందరికి నమస్కారం చెబుతూ , ఈ గర్భిణీ స్త్రీ లకు శ్రీమంతం అనేది చాలా సంతోషకరమైన వేడుక , అదేవిధంగా గర్భిణీగా ఉన్నప్పుడు చాలా జాగ్రత వహించాలి, ప్రధానంగా రక్త హీనత (అనీమియా ) గురించి ప్రస్తావించారు , అనీమియా బారిన పడకుండా మంచి పోషణ తో కూడిన ఆహారం తీసుకోవటంతో పాటు తప్పనిసరిగా రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలని తెలిపారు , అలాగే స్థానిక అంగన్వాడీ టీచర్ వెంకటరమణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ లకు శ్రీమంతం కార్యక్రమం ఎంతో సంతోషాన్ని కలగజేసింది అని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు