పయనించే సూర్యుడు/జనవరి 11/ఖమ్మం జిల్లా బ్యూరో
ఇంచార్జ్ గుగులోత్
భావుసింగ్ నాయక్
దక్షిణ భారతదేశ స్థాయి సైన్స్ ఫెయిర్ కు బురద రాఘవాపురం విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది ఈనెల 7 నుండి 9 వరకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బురద రాఘవాపురం విద్యార్థులు కే మహిమ ఎస్ శ్రావణి గణిత టి భాగం సీనియర్లో విజువలైజింగ్ మ్యాప్స్ అను ప్రదర్శనను ప్రదర్శించి ప్రథమ బహుమతిని సాధించారు అని చెప్పుటకు సంతోషిస్తున్నాము వీరి ఎగ్జిబిట్ ఈనెల 21 నుండి 25 వరకు పాండిచ్చేరిలో జరుగు దక్షిణ భారత దేశ స్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపిక కావడం జరిగింది రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కు వచ్చిన గైడ్ టీచర్లు వీరిని అభినందించారు పాఠశాలలో జరిగిన అభివందన సభలో బహుమతి సాధించిన విద్యార్థులను వారికి గైడ్ టీచర్లుగా వ్యవహరించిన సాగి సుజాత పొట్ట రామారావు వారిని ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఓ అయినటువంటి హెచ్ శ్రీనివాస్ రావు పాఠశాల సిబ్బంది విజయ శ్రీ శ్రీనివాసరావు పుల్లయ్య భారతి నరేష్ నాగేశ్వరరావు భావుసింగ్ ఎస్ఎంసి చైర్మన్ హేమలత మరియు గ్రామస్తులు వారిని అభినందించడం జరిగింది