పయనించే సూర్యుడు/జనవరి 11/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
నాయకులు
దమ్మపేట మండలం జలవాగు గ్రామంలో పర్యటించిన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు అధికారులు మా రోడ్డు ను మర్చిపోయారు మా రొడ్డును కొంచెం పట్టించుకోవాలి అంటున్న ఆదివాసిలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మారెప్పగూడెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జలవాగు గ్రామంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు పర్యటించారు,నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మెటల్ రోడ్డు పోసారని చాలా కాలం అవుతున్నది దానిని అధికారులు గాలికి వదిలేశారనీ,ఇప్పటివరకు ఆ రోడ్డును పట్టించుకున్న వారు లేరు రోడ్డు మొత్తం రాళ్ళు తెలి వాహనదారులకు గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నది,కొత్త ప్రభుత్వం ఏర్పడితే రోడ్లు వస్తాయని ఆశతో బతుకుతున్న ఆదివాసీలకు ఇంకా అది కల గానే మిగిలి ఉన్నదనీ,ఇరు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఈ దారి ప్రధానమైనది,దారి సరిగా లేకపోవడం వల్ల వృద్ధులకు, పేషంట్లకు,బడికి వెళ్ళే బడి పిల్లలకు,రైతులకు బాగా ఇబ్బందిగా మారిందని,కావున స్థానిక ఎమ్మెల్యే మరియు ఆర్ అండ్ బి అధికారులు చొరవ తీసుకొని రోడ్డు ఏర్పాటు చేయాలని తుడుం దెబ్బ నాయకులు కోరారు,ఈ కార్యక్రమంలో బండారు సూర్యనారాయణ, వాసం పోలయ్య,కాంతారావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.