పయనించే సూర్యుడు ప్రతినిధి,( శ్రీరామ్ నవీన్ )తోరూర్ డివిజన్ కేంద్రం
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన,
పెద్ద వంగర, తొర్రూరు మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించారు,
తెలంగాణ మైనార్టీ
రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ (బాలికలు) ప్రభుత్వ బాలికల ఉన్నత సాంఘిక సంక్షేమ శాఖ (బాలికలు ) వసతి గృహం, కాలేజ్ , మహాత్మ జ్యోతిరావు పూలే టిబిసి డబ్ల్యూ ఆర్, స్కూల్ (బాయ్స్) లలో
ఆకస్మికంగా తనిఖీ చేశారు వసతి గృహాలు , కాలేజిలు పాఠశాలలోని తరగతి గదులను, వంట గదులను, స్టడీ రూమ్, స్టాక్ రిజిస్టర్, విద్యార్థులు, ఉపాధ్యాయుల, హాజరు పట్టికలను సందర్శించి తనిఖీ చేశారు,
ప్రభుత్వం మెనూ
ప్రకారం ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ లను రుచికరంగా ఏర్పాటు చేయాలని సూచించారు,
వంటలు సిద్ధం చేసే సిబ్బంది పరిశుభ్రంగా ఉండాలని సూచించారు,
నాణ్యమైన పదార్థాలతో ఆహారం సిద్ధం చేయాలని తెలిపారు,
జిల్లాలోని ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన ప్రదేశాలలో అన్ని వసతి గృహాలను నిత్యం తనిఖీలు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు,
విద్యార్థిని, విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో ప్రతిభ కనబరిచే విధంగా విద్యా బోధనలు అందించాలని సూచించారు,
తెలంగాణ ప్రభుత్వం,
విద్యార్థులకు అందించే డైట్ మెనూ ప్రకారం రుచికరమైన వంటకం అందించడం జరుగుతుందని, పరిశుభ్రత పరిరక్షణ పాటించాలని, వసతి గృహాలు పాఠశాలల పరిసరాల్లో సానిటేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలని,
పాఠశాల,వసతి గృహాల హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, ప్రిన్సిపల్స్ క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం పిల్లలకు ఆహారం అందించాలని, నిత్యం వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి విద్యార్థులను గమనిస్తూ ఉండాలని సూచించారు,
ఈ కార్యక్రమంలో
సంబంధిత వార్డెన్లు ప్రిన్సిపల్ తదితరులు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు….