ఏడి ఎంసీల రిపోర్టును రద్దు చేయాలి
జనవరి 10 పయనించే సూర్యుడు బచ్చన్నపేట జనగామ జిల్లా
బచ్చన్నపేట మండల కేంద్రంలోని 589 బైలుని మూడు ఎకరాల దుర్గమ్మ గుడి స్థలాన్ని కాపాడాలని బచ్చన్నపేట మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీలు అన్నీ కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల క్రితమే 5895లోని మూడు ఎకరాలు గ్రామపంచాయతీ పరిధిలో ఉందని ఇట్టి స్థలంలో 2014లో దుర్గమ్మ గుడి నిర్మాణం చేపట్టి వైభవపీతంగా పలుమార్లు దుర్గమ్మ పండుగను గ్రామస్తులు జరుపుకున్నారని అలాంటి స్థలాన్ని ఎలాంటి సమాచారము గ్రామస్తులకు గాని గ్రామపంచాయతీ సిబ్బందికి గాని స్పెషల్ ఆఫీసర్లకు గాని సమాచారం ఇవ్వకుండా ఏడి మరియు ఎంసీ పర్లకు అన్యాక్రాంతం చేసే విధంగా తప్పుడు రిపోర్టులు ఇవ్వడం సరి అయినది కాదని అఖిలపక్ష పార్టీలు ఏకకంఠంతో ధ్వజమెత్తాయి. ఇలాంటి చర్యలకు పాల్పడితే గ్రామస్తులు అందరూ ఏకతాటిపై నిలబడి స్వతంత్రంగా నడిరోడ్డులో నిలబడి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఈ తప్పుడు రిపోర్టులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు