పయనించే సూర్యుడు ,జనవరి 10 బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఈనెల 31న ఐటిసి సారాపాకలో జరుగు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాలు గెలుపు సాదించి ఐటీసీ లో ఐఎన్టియుసి జెండా ఎగురవేయాలని మాజీ కేంద్ర మంత్రివర్యులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అన్నారు. ఈరోజు ఐ టి సి గెస్ట్ హౌస్ లో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల నాయకులతో సమావేశమైన సందర్భంగా యం. పి. బలరాం నాయక్ మాట్లాడుతూ మన కాంగ్రెస్ పార్టీ పరంగా నా పరంగా ఐఎన్టీయూసీ కార్మిక సంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన వంతు సహకారాలు అందిస్తామని ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల గెలుపుకై నాయకులు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది గనుక ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాలను గెలిపించుకుంటే. ప్రభుత్వం చే యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చైనా సరే కార్మికులకు ఆమోద్యయోగమైన వేతనం ఒప్పందం చేసుకోవచ్చన్నారు అనంతరం. ఐ ఎన్ టి యు సి & మిత్రపక్షాల అధ్యక్షులు గోనె రామారావు. ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, యూనియన్ నాయకులతో పరిశ్రమలో జరగనున్న ఎన్నికల నిర్వహణ గురించి పరిశ్రమలలో ఉన్న పరిస్థితులు గురించి ఎంపీ కి వివరించడం జరిగింది తదనంతరం మోతిలాలనే కార్మిక సోదరుడు ఎంపీ బలరాం నాయక్ సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు