Thursday, January 16, 2025
Homeతెలంగాణసిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు వినతి పత్రం

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు వినతి పత్రం

Listen to this article

పయనించే సూర్యుడు, జనవరి 11 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,బూర్గంపాడు మండలం, ఉప్పుసాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ గ్రామస్తులతో కలిసి, సిపిఐ మండల కార్యదర్శి మువ్వ వెంకటేశ్వరరావు,సబ్కా నాగేశ్వరరావు పినపాక నియోజవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి మువ్వా. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజీవ్ నగర్ గ్రామం ఏర్పడి దాదాపు 35 సంవత్సరాల పైబడి వస్తున్న, ఇప్పటివరకు వారికి తాగునీరు గాని, రోడ్లు గాని, కరెంటు గాని లేకపోవడం, చాలా దౌర్భాగ్యం అని అన్నారు. గిరిజన సమస్యల పరిష్కారంలో ఐటీడీఏ వ్యవస్థ నిర్వీర్యం చెందిందని అన్నారు. కూత వేటు దూరంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు కూడా ఇంతవరకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటంలో ఐటిడిఏ వ్యవస్థ విఫలం చెందిందని ఎద్దేవా చేశారు. ఐటీడీఏ లో ఉద్యోగులు నెలసరి జీతాలతో నెలకు ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయవచ్చు అని చెప్పి అన్నారు. పాయం వెంకటేశ్వరరావు గెలిచిన వెంటనే శ్రీరాంపురం ఎస్టి గ్రామానికి 30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం శాంక్షన్ చేయించాడని, వారికి బూర్గంపాడు మండల సమితి సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. అలాగే రాజీవ్ నగర్ గ్రామస్తులకు కూడా వారి మౌలిక వసతుల సాధనలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే ఆ గ్రామాన్ని సందర్శించి, వారికి మౌలిక వసతులు సాధనలకు కృషి చేస్తానని చెప్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ నాయకులు నాగేశ్వరరావు, రాజీవ్ నగర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments