నందిగామ చౌరస్తాలో సిమెంట్ బల్లాలను ఏర్పాటుచేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు జనవరి 11 కొత్తుర్ రిపోర్టర్ విస్లావత్ పీరు )
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో చౌరస్తా వద్ద నాలుగు వరుసలా రహదారి వేయడంతో అక్కడున్న బస్ స్టాప్ తీసివేయడం జరిగింది. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని స్థానిక మాజీ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ బస్ స్టాప్ లో తాత్కాలికంగా సిమెంట్ బల్లాలను రహదారికి ఇరువైపులా వేయించారు ఇందుకు బాటసారులు వివిధ గ్రామాలకు ప్రయాణం అయ్యే ప్రజలు హార్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు
ఇట్టి సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ మాట్లాడుతూ గ్రామంలో బస్ స్టాప్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించి వెంటనే రహదారికి ఇరువైపులా సిమెంట్ బల్లలాను ఏర్పాటుచేసిన మాజీ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి చిన్న కష్టాన్ని కూడా తనదిగా భావించి షాద్ నగర్ ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి అంజయ్య యాదవ్ అని ఇకముందు కూడా పదవి ముఖ్యం కాదు ప్రజాసేవనే ముఖ్యమని ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటారని తెలిపారు. ఇంతకు మునుపున్న బస్ స్టాప్ ఆవరణ నాలుగు వరుసల రహదారి విస్తరణ తో తొలగించడం జరిగిందని కొంత ఇబ్బంది కలిగిన రహదారి విస్తరణతో కొత్తూరు నుండి షాద్ నగర్ వరకు ఎంతో అభివృద్ధి జరిగిందని అందుకు సహకరించిన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ కి మరియు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు