షాద్ నగర్ బీఆర్ఎస్ యువనేత వై. రవీందర్ యాదవ్
తొమ్మిది రేకుల ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన యువ నేత రవి
యువతకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన యువనేత రవీ
( పయనించే సూర్యుడు జనవరి 11 కొత్తూరు రిపోర్టర్ విస్లావత్ పీరు )
క్రీడలకు పుట్టినిల్లు పల్లెటూర్లు అని ఏ క్రీడ మొదలైన ముందుగా పల్లెటూర్లలోనే పుడుతుందని షాద్ నగర్ బీఆర్ఎస్ యువనేత, మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ అన్నారు. కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో క్రికెట్ టోర్నమెంటును బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్ లంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యాచ్ కు ముందు రవీందర్ యాదవ్ బ్యాటింగ్ చేస్తూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం మాట్లాడుతూ.. పల్లెటూర్లలో యువత సంక్రాంతి సందర్భంగా చేసే కోలాహలం గురించి చెప్పడం వర్ణతీతం అని అన్నారు. క్రీడలు స్నేహపూర్వకంగా ఆడుతూ గత స్మృతులను నెమరు వేసుకుంటూ పండగ వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుందని, అదేవిధంగా స్నేహభావాన్ని పెంపొందించి దేహదారుడ్యానికి ఎంతో ఉపయోగపడేలా టోర్నమెంటులు యువత చేపట్టడం అభినందనీయమని అన్నారు. యువతకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ జడ్పీటీసీ నర్సింగరావు మాజీ సర్పంచులు సావిత్రి బాలరాజు, నవీన్ కుమార్, శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ యాదయ్య, నాయకులు భూపాల్ రెడ్డి, ప్రేమ్ కుమార్ గౌడ్, జమాల్ ఖాన్, సాజిద్, జగన్మోహన్, గణేష్ గౌడ్, వెంకటేష్ మరియు ఆర్గనైజింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు.