పయనించే సూర్యుడు జనవరి 11, కాకినాడ జిల్లా ప్రతినిధి (బి వి బి)తెలుగుజాతి సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిభపించే విధంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సిహెచ్ పిఎస్ వీర్రాజు తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవ్ పట్నం రైల్వే గేట్ వద్ద గల సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆవరణలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని మరియు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ తెలుగుజాతి సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఏ ఊరు వెళ్ళిన తిరిగి మన ఊరు వచ్చి ఎంతో భక్తిశ్రద్ధలతో సంక్రాంతి పండుగనుఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన రంగోలి లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను డాక్టర్ వీర్రాజు చేతులు మీదుగా ప్రధానం చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ ఆదినారాయణ మరియు ఏవో తిరుపతిరావులు మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రాజా, మేనేజర్ సురేష్,డాక్టర్ నాగం రఘువంశి, డాక్టర్ రామ్ పనేంద్ర, డాక్టర్ కల్పనా ,డాక్టర్ లెనిన్, హెచ్ ఆర్ లు సౌజన్య కే ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.