పయనిచ్చే సూర్యుడు జనవరి 13 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న )విద్యార్థి దశలోఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కన్వీనర్ గా,ఆరు సంవత్సరాలు సేవలు కోకన్వినర్
భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పది సంవత్సరాలు పర్యాయ సేవలుఅందించినయువనేత,ఆర్యవైశ్య ముద్దుబిడ్డ,బమ్మెర వాస్తవ్యులు, యువకేరటం, పార్టీ భవిష్యత్ కోసం తనదైన శైలిలో సేవలందిస్తు అనుక్షణం అనునిత్యం పార్టీ చేబట్టే ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలనే తపన తో పార్టీ కోసం,ప్రజల కోసం పరితపించే యువనాయకుడికి మండల పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని కార్యకర్తలు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మారం రవి కుమార్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో విశ్వాసం తో మండల పార్టీ పగ్గాలు అందించడంలో కృషి చేసినపార్టీజిల్లాఅధ్యక్షులకి,నియోజకవర్గ ఇంచార్జి కి,అధికార ప్రతినిధులకు జిల్లా మరియు నియోజకవర్గ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు