భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం.పయనించే సూర్యుడు రిపోర్టర్ యూసఫ్
వైరా నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పిల్లాపాపలతో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. భోగభాగ్యాల మధ్య భోగి పండుగను నిర్వహించుకోవాలని, ఇంటి వాకిట్లో రంగు రంగుల ముగ్గులతో కనువిందు చేయాలని, కనుమ పండును కన్నులారా జరుపుకోవాలని, నియోజకవర్గంలోని ప్రతీ కుటుంబంలో కూడా ఆనందకేళీలు వికసించాలని కోరారు.