Wednesday, January 15, 2025
HomeUncategorizedలయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

Listen to this article
  • రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
  • రామగిరి ఎస్ఐ చంద్రకుమార్

పయనించే సూర్యుడు న్యూస్ : రామగిరి: సెంటినరీ కాలనీ :-13

రామగిరి మండలం సెంటినరీ కాలనీలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటనరీ కాలనీ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు మొలుమూరి శ్రీనివాస్, డైరెక్టర్స్ , మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ హాజరయ్యారు. దీనిలో భాగంగా యమధర్మరాజు వేషధారణతో వాహన చోదకులు వాహనంపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించనివారు తమ వెంటనే ప్రమాదం ఉందని తెలుపుతూ, ధరించిన వారికి పూలు ఇచ్చి అభినందించడం జరిగింది.రామగిరి ఎస్సై చంద్రకుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు లయన్స్ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. అలాగే
ప్రజలు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, రోడ్డు భద్రతా చర్యలు పాటించకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణం అని రాంగ్ సైడ్ డ్రైవింగ్, రోడ్డు భద్రతా నియమాలు లేకపోవడం, చర్యలు, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం మొదలైన వాటి వల్ల రోడ్డు ప్రమాదాల గురించి మనం ఎప్పుడూ వార్తల్లో వింటూనే ఉంటాం. చాలావరకు ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వలన జరుగుతున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు తమ కుటుంబం గురించి ఆలోచించి హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ ఇచ్చినట్లయితే ఏదైనా జరిగితే మైనర్లపై మరియు వాహన యజమానిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడపడం చాలా ప్రమాదకరం మీతో పాటు తోటి వారికి కూడా నష్టం చేకూరుస్తుంది,వాహనం నడిపేటప్పుడు అన్ని రకాల పత్రములను వెంట ఉంచుకోవాలని తెలిపారు. అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదంతో కుటుంబం చిన్న భిన్నం అయ్యే అవకాశం ఉందని కావున అందరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్ డాక్టర్ శరణ్య మారుతి యాదవ్, కళాదర్ రెడ్డి వీరితో పాటు పోలీసు సిబ్బంది శ్రీనివాస్,చంద్రమౌళి, రాజ్ కుమార్,క్లబ్ సభ్యులు శ్రీనివాస చారి, సురేష్ మరియు సింగరేణి యువ బలగం సభ్యులు క్రాంతి, సంతోష్ ,శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments