
శేరిలింగంపల్లి, జనవరి 21 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్)
మంగళవారం రోజు నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీ ,ట్రాఫిక్ సమస్యలు,మౌలిక వసతుల కల్పన పై తక్షణమే తగిన చర్య లు తీసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన బీజేపీ రాష్ట్ర కార్య
వర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే ఇంఛార్జి రవి కుమార్ యాదవ్,ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ నియోజకవర్గంలో దాదాపు అన్ని డివిజన్లలో చాల వరకు రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థపాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని,అలాగే ఆఫీసు
లు అన్ని తెరుచుకున్నాయని ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగాయని,ఇళ్లకు ఆఫీసులకు చేరుకోవడానికి గంటల తరబడి సమయం పడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు,వాహనదారులు,ప్రజలు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని,
చాలా మంది ఇదే విషయాన్నిమా దృ
ష్టికి తీసుకువచ్చారని కావున తక్షణమే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ చే యాలని, ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి సంబంధి త అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామ ని హామి ఇవ్వడం జరిగిందన్నారు.