
శేరిలింగంపల్లి,జనవరి 21 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్)
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఇందిరమ్మ సభలను వినియోగించు కోవా లని,వార్డు సభల్లో కాంగ్రెస్ పార్టీ నాయకు లు భాగస్వామ్యమై అర్హులకు సం క్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పిలు పునిచ్చారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హిస్తున్న ఇందిరమ్మ సభ కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ వార్డ్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియో జకవర్గ నాయకులతో కలిసి పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీ శ్వర్ గౌడ్.
మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు జరిగే వార్డు సభల్లో అర్హులైన ప్రతీ ఒక్క రికి రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు,రై తుభరోసా తదితర పథకాలు అందేలా ప్రతిఒక్కరు కృషి చేయాలని సూచించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ఇందిరమ్మ పట్టణ గ్రామ సభలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని,ప్రతి వార్డ్ కార్యాలయంలో నేటి నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే సభలను వినియో గించుకొని రేషన్ కార్డు ల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు..అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్లు అందిస్తుంద ని,ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల దరఖా స్తులు చేయని వారు గ్రామాల్లో 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలో దర ఖాస్తులు చేసుకోవాలన్నారు.75 గజాల స్థలం ఉన్న ప్రతీ ఒక్కరికి ఇంటి నిర్మాణా నికి ప్రభు త్వం నాలుగు విడతలుగా
రూ.5 లక్షలు ఇస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుల జారి పై కీలక ప్రకటన చేసారని,జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందవద్దని నేటి నుంచి నిర్వహించే ఇందిరమ్మ సభ ల్లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోగల రు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివి జన్ అధ్యక్షులు నగేష్నాయక్,నాయకులు నాగేశ్వరరా వు,కోటేశ్వరరావు,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముష్రాఫ్,రెహ్మా న్,రాజు,కిట్టు,నరేష్,ప్రభు,మెయిన్,శ్రీనివాస్‌గౌడ్,అంజద్,ఖాజా,ముక్తార్,మణికప్ప,రాజేష్,శంకర్ మహిళలు శిశిరేఖ,అ నిత,లక్ష్మీ,శ్రీజ రెడ్డి,ప్రేమ,సర్దార్ తదితరులు పాల్గొన్నారు.