పయనించే సూర్యుడు వెంకటాపురం మండలంరీపోటర్ బట్టా శ్రీనివాసరావు:- జనవరి 24 ములుగు జిల్లా వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ మరియు సైన్స్ ల్యాబ్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ఈరోజు వెంకటాపురం మండలంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో (TSEWIDC) నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు 🖥 కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం, 🧪సైన్స్ ల్యాబ్ ప్రారంభం, స్కూల్ బెంచీలు పంపిణీ కార్యక్రమం, చేపట్టారు అలాగే స్కూలు పిల్లలకు సైకిల్స్ ను స్థానిక ఎమ్మెల్యే – ప్రజా సేవకులు గౌ,, శ్రీ డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.