పయనించే సూర్యుడు జనవరి 26 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు ఎస్ గోపాల్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం పాఠశాల వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లి బస్టాండ్ సర్కిల్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం పాఠశాలలో రిపబ్లిక్ డే గురించి ప్రధానోపాధ్యాయుల ఎస్ గోపాల్ విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ గోపాల్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు
జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
RELATED ARTICLES