పయనించే సూర్యుడు న్యూస్ : 30.జనవరి. రాజంపేట మండలం. అన్నమయ్య జిల్లా:
జింగి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జింగి యాప్ వ్యవస్థాపకులు మరియు సీఈఓ మురళీకృష్ణ తెలిపారు. బోయనపల్లిలో గురువారం చిక్ పేట్ డొన్నే బిరియాని రెస్టారెంట్ ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా రాజంపేటలో జింగి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ యాప్ ను ఆ సంస్థ సీ ఈ ఓ మురళీ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళి కృష్ణ మాట్లాడుతూ జింగి ఫుడ్ డెలివరీ యాప్ ఏర్పాటు చేసి అన్ని సిటీలలో విజయ
వంతంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఇక్కడ ఈ యాప్ ద్వారా రాజంపేట పట్టణంలోని అన్ని సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే స్థాయిలో ప్రతి మండలంలో కూడా ఈ ఫుడ్ డెలివరీ యాప్ ను నిర్వహిస్తామన్నారు. బ్రాంచ్ మేనేజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ యాప్ ప్రత్యేకత ఫుడ్ డెలివరీ మాత్రమే కాక నిత్యవసర సరుకులు, మెడిసిన్, కాస్మోటిక్ ఇలా అన్నీ సకాలంలో డెలివరీ చేయటం తమ ప్రత్యేకతని, ఇటువంటి యాప్ రాజంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయటం ఎంతో ఆనందమని అన్నారు. ఈ జింగి యాప్ ను రాజంపేట ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రోత్సహించాలన్నారు. అనంతరం యాప్ కరపత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జింగి యాప్ బ్రాంచ్ మేనేజర్ నగేష్ , సిబ్బంది ,డెలివరీ బాయ్స్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : కరపత్రాలు ఆవిష్కరిస్తున్న జింగి యాప్ బృందం