పయనించే సూర్యుడు, జనవరి 30, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత :
జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో కో హాన్స్ లైఫ్ సైన్సెస్ వారి సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా ముక్త్యాల గ్రామ ప్రజల అవసరం నిమిత్తం ఏర్పాటుచేసిన అంబులెన్సును కోహెన్స్ ప్రతినిధులతో కలిసి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం చిన్న బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సేవలకు అత్యవసర వాహన సేవలు అవసరమన్నారు. ప్రజలందరూ 108 సేవలు వినియోగించుకోవాలన్నారు. గ్రామానికి అంబులెన్స్ ను ఏర్పాటుచేసిన కో హాన్స్ ఫార్మా కంపెనీ వారిని చిన్నబాబు అభినందించారు.ఈ కార్యక్రమంలో కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్ మురళీధర్, సీనియర్ జనరల్ హెచ్ ఆర్ మేనేజర్ వెంకట్రావు, గ్రామ సర్పంచ్ షేక్ అస్మతూన్ మరియు గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబులెన్సును ప్రారంభించిన శ్రీరాం చిన్నబాబు
RELATED ARTICLES