-జగనన్న హయంలో సంక్షేమ పథకాల్లో సింహభాగం బీసీలకే బడుగువర్గాల వారి ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు జగనన్న మాజీ మంత్రి వర్యులు విడదల రజిని
పయనించే సూర్యుడు న్యూస్ (ఫిబ్రవరి 1) పల్నాడు జిల్లా చిలకలూరిపేట రిపోర్టర్ కుడారి జాన్సన్
వార్తావిశ్లేషణ :-చిలకలూరిపేట:బడుగు,బలహీన వర్గాల వారి అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బీసీల ఆశాజ్యోతిగా నిలిచారని మాజీ మంత్రి వర్యులు విడదల రజిని తెలిపారు.పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నూతన అధ్యక్షుడుగా గురజాల నియోజకవర్గానికి చెందిన సిద్దాడపు గాంధీ నియమితులైన సందర్భంగా శనివారం మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని ని చిలకలూరిపేటలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు విడదల రజిని మాట్లాడుతు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్లో సింహభాగం బీసీలకే దక్కాయి అని తెలిపారు.గుర్తింపు లేకుండా,అసలు ఉనికే కోల్పోయే దశలో ఉన్న బీసీ కులాలకు జవసత్వాలు నింపి ప్రత్యేక కార్పొరేషన్లను ప్రకటించడం ద్వారా తమ నాయకుడు వైఎస్ జగన్ బీసీల మనుసులు
గెలుచుకున్నారని చెప్పారు.బీసీల బ్రతుకులు బాగుండాలి అంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో జగనన్న ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని బీసీల అభ్యన్నతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని తెలిపారు.పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వారి తరుపున పోరాటాలు చెయ్యాలని సూచించారు.