
పయనించే సూర్యుడు// న్యూస్// మక్తల్ నియోజవర్గ ఇన్చార్జి // వడ్ల శ్రీనివాస్ ఫిబ్రవరి 20 తేదీ సందర్భంగా ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడా పోటీల్లో 25 జట్లు పాల్గొనగా .. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో వీరభద్ర VS అనుగొండ టీమ్ ల మధ్య హోర హోరీగా సాగిన మ్యాచ్ లో చివరకు మొదటి బహుమతిగా మక్తల్ వీరభద్ర టీమ్ మరియు రన్నరప్ గా అనుగొండ గ్రామ హోం టీమ్ మరియు మూడవ విజేత గా పెద్దకడూమూర్ గ్రామ టీమ్ గెలుపొందడం జరిగింది. మొదటి బహుమతి ప్రైజ్ మని 10000 /- రూ. మాజీ సర్పంచ్ గడ్డం రమేష్ గారు,ద్వితీయ బహుమతి 8000/- గడ్డంపల్లి హనుమంతు గారు,తృతీయ బహుమతి నంబర్ తిరుపతి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రెస్ దాతలు సతీష్ కులకర్ణి గారు,వన్నవడ శ్రీకాంత్ గారు.. షీల్డ్ దాతలు కల్లేటి వీరమ్మ గారు,అన్నదాన దాతలు చాకలి నరేందర్,శ్రీనివాసులు చారీ గారు మరియు ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అనుగొండ గ్రామ మాజీ ఎంపీటీసీ,ఉపసర్పంచ్,వార్డ్ సభ్యులు, పెద్దలు,యువకులు అందరికీ పేరుపేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు ..
ఇట్లు,
ఛత్రపతి శివాజీ యూత్ అనుగొండ.
