
పయనించే సూర్యుడు న్యూస్ // జులై 7 .నారాయణపేట జిల్లా బ్యూరో //
చేపల ఉత్పత్తి మరియు ఉత్పధాకత ను పెంచడం ద్వారా మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి మరియు దేశంలో ఆరోగ్యం అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ,ఎగుమతులు, ఉపాధి మరియు పర్యాటక రంగాన్ని మెరుగు పార్చటంతో పాటు దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థని వేగవంతం చేయడం కోసం ఏర్పాటు చేసిందే ఈ నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు, ఈ బోర్డు అప్పటి భారతదేశ వ్యవసాయ మంత్రి శరత్ పవర్ హైదరాబాదులో ప్రారంభం చేసినారు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పాటు చేసింది కాదు దక్షిణ భారత దేశంలో ఈ యొక్క చేపల ఉత్పత్తి పెంచాలి, చేపల పరిశోదనా చెయ్యాలి అనే ఆలోచన తో హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు కానీ యిప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ఈ NFDC బోర్డుని అమరావతికీ తరలించాలి అని కేంద్రంకీ లేఖ రాయడం దారుణం, తెలంగాణ లో కూడా ప్రాజెక్టులు కట్టినారు, 40 వేల చెరువులు పునరుద్దరణ జరిగింది యిక్కడ కూడా అధిక సంఖ్యలో ముదిరాజ్ లు మత్స్యకారులు ఉన్నారు వారందరి సంక్షేమం కూడా ముఖ్యం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ బోర్డు ఆంధ్రప్రదేశ్కు తరలించడం జరగరాదు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ చొరవ చూపాలి.యిట్టి విషయంలో కేంద్రం పైన వత్తిడి తెచ్చి చంద్రబాబు కుట్రలు అడ్డుకోవాలి, బనక చర్ల ద్వారా గోదావరి నీళ్లు, పోతిరెడ్డి పాడు ద్వారా కృష్ణ నీళ్లు తరలించే విధంగా ఈ బోర్డును కూడా తరలించడం దారుణం కాబట్టి తెలంగాణ ప్రభుత్వము వెంటనే స్పందించాలని గవినోళ్ల శ్రీనివాస్ సామాజిక కార్యకర్త జి. సుభాష్ మాజి సర్పంచ్. గడి ముంకన్ పల్లి. గౌని శీను, ఎంనోనిపల్లి మరియు మాజి ఎంపీటీసీ నారాయణ పేట్ జిల్లా వాసులు తీవ్రంగా ఖండించినారు
